టాప్ లెస్‌ డ్రస్‌తో సముద్రం ఒడ్డున కవ్విస్తున్న యువతి ఫొటోతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫేస్‌బుక్ డీపీ..

R9TELUGUNEWS.Com.: టాప్ లెస్‌ డ్రస్‌తో సముద్రం ఒడ్డున కవ్విస్తున్న యువతి ఫొటోతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫేస్‌బుక్ డీపీ..

. అలాగే బీచ్ ఫొటోలు, అర్ధ నగ్న ఫొటోలతో ఉన్న ఎమ్మెల్యే ఫేస్‌బుక్ పేజీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిత్యం ప్రభుత్వంపై వాడివేడీ విమర్శలు చేస్తూ బిజీగా ఉండే జగ్గారెడ్డి పేజీలో ఆయన కార్యక్రమాలు కాకుండా ఇతర ఫొటోలు దర్శనమివ్వడంతో అందరూ విస్తుపోయారు. ఈ విషయం ఆయన దృష్టికి వెళ్లడంతో జగ్గారెడ్డి సైతం షాక్‌కు గురయ్యారు. ఇంతకూ ఏం జరిగిందంటే..సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరిట ఫేక్ ఫేస్ బుక్ పేజీని గుర్తు తెలియని వ్యక్తులు క్రియోట్ చేశారు. ‘Jagga Reddy Turpu’ పేరిట పేజీని క్రియోట్ చేసి అసభ్యకమైన అమ్మాయి ఫొటోలు పోస్ట్ చేశారు. డీపీగానూ ఓ యువతి ఫొటోను పెట్టారు. దీనిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందిస్తూ.. ‘‘నా పేరుతో కొత్తగా ఫేక్ ఫేస్‌బుక్ క్రియేట్‌ చేశారు. ఫేస్‌ బుక్‌ ఐడీ నాది కాదు.. సంగారెడ్డి నియోజక వర్గ ప్రజలు ఎవరూ కూడా మోసపోవద్దు. సైబర్‌ నేరగాళ్ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి.. ఆ అకౌంట్ తో మెసేజ్‌ లు పెడితే.. పట్టించుకోకండి. ఈ ఫేస్ బుక్‌ డీపీగా అమ్మాయి ఫొటో పెట్టారు. అలాగే కొన్ని తప్పుడు ఫొటోలు పెట్టి నా పేరును డ్యామేజ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తా.’’ అని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను, ప్రజలను అప్రమత్తం చేశారు.