ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఆలోచన లేదు.. ప్రజల మధ్యలో ఉంట.. జగ్గారెడ్డి

తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి టార్గెట్‌నే విమర్శలు, లేఖలు రాశారు జగ్గారెడ్డి.
పార్టీలోకి సడన్‌గా వచ్చి లాబీయింగ్‌ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చన్నారు. అలాంటి తప్పు తాను చేయబోనన్నారు. తనపై కుట్ర పూరితంగానే కోవర్టు అన్న ఆరోపణలు చేస్తున్నారని, అయినా పార్టీ వ్యవస్థ వాటిని ఖండించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. ఆర్థిక కష్టాలు ఉన్నా పార్టీ కోసమే పని చేశానని సోనియా, రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆరోపణలు పడే కంటే స్వతంత్రంగా ఉండటం బెటరన్న నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం చేశారు…కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా అధికారికంగా ప్రకటించారు. దీనిపై శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు సంగారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులు, తన అనుచరులకు జగ్గారెడ్డి సమాచారం ఇచ్చారని.. అయితే ఇప్పటికిప్పుడు వేరే పార్టీలో చేరే ఆలోచనలో లేరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.

అంతన్నాడు ఇంతఅన్నాడు,, అంతలోనే,
అదిగో ఇదిగో అన్నారు. ఇవాళే గుడ్‌బై చెప్పేస్తానన్నారు. టైం కూడా ఫిక్స్‌ చేశారు. డెడ్‌లైన్‌ ముగిసే సమయానికి కాస్త వెనక్కి తగ్గారు. ఇప్పుడు కాదు రెండు, మూడు రోజుల్లో నిర్ణయిస్తానని చెప్పుకొచ్చారు. పైగా పార్టీలో అవమానం జరుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి, ముఖ్యనేత రాహుల్‌గాంధీకి లేఖలు రాశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి తీరుతో కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొంది. అది ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితి కనపించడం లేదు. గతకొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవ‌మానానికి గుర‌వుతున్న జ‌గ్గారెడ్డి శ‌నివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వచ్చాయి. తాజాగా లేఖతో సరిపెట్టారు జగ్గారెడ్డి.