జగ్గారెడ్డి కి కాంగ్రెస్ షాక్….వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తొలగించిన కాంగ్రెస్…

జగ్గారెడ్డి కి కాంగ్రెస్ షాక్

వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తొలగించిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బాధ్యతలను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. జగ్గారెడ్డికి అప్పగించిన కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పించిన టీపీసీసీ…..సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఆ పార్టీ పెద్ద షాక్ ఇచ్చింది. ఆయనకు గతంలో అప్పగించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పించింది. అలాగే, పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా తప్పించింది. జగ్గారెడ్డి బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లయిన అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్, మహేష్ గౌడ్‌లకు రేవంత్ రెడ్డి అప్పగించారు. కాగా, ఇటీవల జగ్గారెడ్డి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తన మీద ఇంకో అభ్యర్థిని నిలబెట్టి దమ్ముంటే గెలిపించాలని వ్యాఖ్యానించారు…