కాంగ్రెస్ పార్టీ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు…

కాంగ్రెస్ పార్టీ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్ట్‌లకు ఇళ్లు, జాగ్వార్ కార్ ఇస్తే.. తాను కార్ పార్టీ( టీఆర్‌ఎస్‌) లోకి రావడానికి రెడీ అని అన్నారు.

ఇళ్ల గృహ ప్రవేశం కాగానే టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వస్తానని అసెంబ్లీ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జర్నలిస్ట్‌లతో సరదా సంభాషించారు… జగ్గారెడ్డి. అవసరం అనుకుంటే ఒక టర్మ్ అసెంబ్లీ ఎన్నికలకు సైతం పోటీ కూడా చేయనని అన్నారు.
తన అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ప్రజలకు చెబుతానని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్‌పై వ్యతిరేకతతో కాంగ్రెస్‌లో చేరలేదని గుర్తు చేశారు…. ఈ వ్యాఖ్యలు కొందరు జర్నలిస్టులు టిఆర్ఎస్ పార్టీలో వచ్చి ఎమ్మెల్యే అయ్యారు వారిని ఉద్దేశించే అన్నట్లుగా ఉంది అనుకుంటున్నారు..