బెల్లం టీ తాగితే ఇన్ని ప్రయోజనాలు..!!

చాలామందికి పొద్దున లేవగానే టీ కానీ, కాఫీ కాని పడిందే వారి పనులు మొదలవవు.మరియు ఇంటికి చుట్టాలు వచ్చినా కాఫీ నే,బయటకు వెళ్లిన కాఫీ నే,కొంచెం ఆకలి వేసిన కాఫీనే తాగుతూ ఉంటారు.అలా కాఫీని ఎక్కువగా తాగేవారు చక్కెరను ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది.దీనితో క్రమంగా డయాబెటిస్,అధిక బరువు,కిడ్నీ సమస్యలు వంటి మొదలవుతాయి.అలాకాకుండా చక్కెర బదులుగా బెల్లం వాడితే సమస్యలన్నిటికీ దూరంగా ఉండవచ్చు అని చెబుతున్నారు ఆహారనిపుణులు.అసలు బెల్లం వాడితే కలిగే ప్రయోజనాలు ఏంటో మనము తెలుసుకుందాం పదండీ..చక్కెరలో ఎలాంటి పోషకాలు దొరకకపోగా అధిక క్యాలరీలు మాత్రమే లభిస్తాయి.ఈ క్యాలరీలను శరీరం బర్న్ చేయలేక కొవ్వు రూపంలో పేరుకుపోయేలా చేస్తుంది.దీనితో అధిక బరువు,డయాబెటిస్ వంటి సమస్యలు కలుగుతాయి.దీనికి బదులుగా బెల్లం వాడటంతో ఇందులో ఖనిజాలు పుష్కళంగా లభిస్తాయి. దానితో రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

బెల్లం కలిపిన టీనీ తరుచూ తీసుకోవడంతో జలుబు, దగ్గు నుండి తక్షణమే ఉపశమనం కలుగుతుంది.ఇందులోనే చిన్న అల్లం ముక్క వేసి తాగమంటే ముక్కు దిబ్బడ నుంచి తెరుకోవచ్చు.
అంతేకాక అలెర్జీ,ఆస్తమా,బ్రాంకటిస్ వంటి శ్వాసకోశ సమస్యల నుండి కూడా దూరంగా ఉండవచ్చు.

బెల్లం టీలోని పొటాషియం అధికంగా లభించడంతో రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.

బెల్లం టీపొట్టలోని జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించడంలో అధిక పాత్ర పోషిస్తుంది.దానితో మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.అంతేకాక అజీర్తి,గ్యాస్,మలబద్ధకం వంటి పొట్ట సమస్యలను కూడా దూరం చేస్తుంది.

బెల్లం ఐరన్ యొక్క అద్భుతమైన మూలం అని చెప్పవచ్చు.హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారిలో ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

బెల్లం టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నందున ఇది కీళ్ల నొప్పులు,వాపులను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.బెల్లం టీలో వున్నా కార్బోహైడ్రేట్లు తొందరగా జీర్ణం అవుతాయి.నీరసం అనిపించే వారు ఈ బెల్లం టీ నీ తీసుకోవడంతో శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.కావున మీరు కూడా చక్కరని స్కిప్ చేసి బెల్లం వాడడం మొదలుపెట్టడం ఉత్తమం..