జైపూర్ లో పెండ్లికి వెళ్లి నదిలో పడ్డ కారు..8 మంది మృతి..

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది.
పెళ్లి వేడుకలో పాల్గొనడానికి వెళ్లే క్రమంలో కోట (Kota) వద్ద కారు అదుపుతప్పి నదిలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిమంది సజీవ సమాధి అయ్యారు.
ఎనిమిది మంది కారులో వివాహ వేడుకకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కోట వద్ద చంబల్‌ నది (Chambal river) దాటుతుండగా అదుపుతప్పి అందులో పడిపోయింది. దీంతో అందులో ఉన్న ఎనిమిది మంది మృతిచెందారు.