సూపర్ స్టార్ రజినీకాంత్, తమన్నా జంటగా నటించిన చిత్రం జైలర్. ..

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇందులో రమ్యకృష్ణ, వసంత్ రవి కీలక పాత్రల్లో నటించారు.
తలైవా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా నేడు (ఆగస్టు10) ‘జైలర్’ చిత్రం గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. దీంతో ఈ సినిమా చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు…ఫస్ట్ హాఫ్ లో యోగిబాబు, రజనీకాంత్ మధ్య కామెడీ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసే విధంగా ట్విస్ట్ లు, కర్ణాటకకి స్టోరీ మారడం లాంటి అంశాలతో ఫస్ట్ హాఫ్ సాగుతుందని తెలుస్తోంది. ..ఊహించని పరిస్థితుల్లో రజనీకాంత్ ఏం చేస్తారు అనే సస్పెన్స్ కొనసాగుతోంది. అలాగే సెకండ్ ఆఫ్‌లో ఫ్యాన్స్ కోరుకున్న విధంగా నెల్సన్ కొన్ని గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ పెట్టారట. దీంతో రజినీకాంత్, నెల్సన్ కచ్చితంగా హిట్ కొడతారని నెటిజన్లు భావిస్తున్నారు. జైలర్‌ మూవీ కచ్చితంగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.మరో నెటిజన్ రజినీ ఇంట్రడక్షన్, డార్క్ కామెడీ, కమర్షియల్ యాంగిల్స్ అన్ని అదిరిపోయాయని రాసుకొచ్చాడు.దీంతో ప్రస్తుతం ట్విట్టర్‌ రజినీ మ్యానియాతో ఊగిపోతోంది.

మొత్తానికి జైలర్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. పలు థియేటర్స్ వద్ద రజినీ అభిమానులు రచ్చ రచ్చ చేస్తున్నారు.