జమిలిఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్‌ కమిటీ..!

దేశంలో జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణ సాధ్యా సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ram Nath Kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తైంది..ఈ మేరకు తుది నివేదికను నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu)కు అందజేసింది.

దేశంలో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఒకే దేశం-ఒకే ఎన్నిక (one nation – one election) నినాదంతో జమిలి ఎన్నికల నిర్వహణ మనదేశంలో ఎంతవరకు సాధ్యం, ఇతర అంశాలపై వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలు సేకరించింది. ఇవాళ ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్మును కలిసి తుది నివేదికను సమర్పించింది. మొత్తం 18,626 పేజీలతో కూడిన రిపోర్ట్‌ను రాష్ట్రపతికి అందించింది..