జమ్మూకాశ్మీర్ లో శాంతిభ‌ద్ర‌త‌లు కాపాడ‌టంలో కేంద్రం విఫ‌లం అయింది…..ఫరూక్ అబ్దుల్లా..

జమ్ము కాశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలపై పలు పార్టీలు కేంద్ర బిజేపి పై విమర్శలు గుప్పిస్తున్నాయి..

జమ్మూకాశ్మీర్లో పూర్తిగా శాంతి లోపించిందని ఆరోపణలు..

జమ్మూకాశ్మీర్ లో శాంతి స్థాపన చేసేందుకు ప్రభుత్వం చేసిన బలవంతపు ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. హజ్రత్ బల్ నియోజకవర్గంలో ఒక రోజు పాటు బుధ‌వారం జరిగిన సమావేశంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అబ్దుల్లా మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు ప్రభావాలను ప్రతీ ఫ్రంట్ లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న హింసల ద్వారా చూడవచ్చ‌ని విమ‌ర్శించారు. 2019 ఆగస్టు 5వ తేదీన అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాల వల్ల తలెత్తిన భయానక పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం. జమ్మూకశ్మీర్ లో శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి అంటూ అబ్దుల్లా పేర్కొన్నారు. అలాగే కశ్మీర్, జమ్మూ, చీనాబ్, పీర్ పంజల్లలో శాంతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయడంలో విఫలమైందని ఆయ‌న చెప్పారు.