అలనాటి సినీ తార జమున (86) ఇకలేరు…

*సీనియర్ నటి జమున కన్నుమూత*

అలనాటి సినీ తార జమున (86) ఇకలేరు.

గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, జగ్గయ్య సహా పలువురు దిగ్గజ నటులతో జమున నటించారు. 11 గంటలకు జమున భౌతికకాయాన్ని ఫిల్మ్‌ఛాంబర్‌కు తరలిస్తారని తెలిసింది. జమున 1936 ఆగస్టు 30న కర్ణాటక హంపీలో జన్మించారు.