జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం…

జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం..

జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. జనగామ జిల్లా పెంబర్తి లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థినిలకు అస్వస్థత నెలకొంది.

దీంతో హుటాహుటిన జన గామ మాత శిశు ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఐదుగురు విద్యార్థినిలకు ఫుడ్‌‌ పాయిజన్ అయినట్లు వెల్లడించారు వైద్యులు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు… వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

3 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు చెబు తున్నారు. కాగా…ఈ సంఘ టనపై కేసు నమోదు చేసు కున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.