కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి హైకమాండ్ కీలక బాధ్యతలు
సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం జన నైతృత్వంలో ఫోర్ మెన్ కమిటీ…
జానారెడ్డి , మణిక్రావు ఠాక్రే , దీపదాస్ మున్షీ , మీనాక్షి నటరాజన్ తో కమిటీ….
టికెట్ల ప్రకటన తర్వాత అసంతృప్తులని బుజ్జగించే బాధ్యత.
ఇవాళ సమావేశం కానున్న జానారెడ్డి ఫోర్ మెన్ కమిటీ..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేరోజు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకాగానే రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇప్పటికే నియోజకవర్గాల వారిగా పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. రెండుమూడు రోజుల్లో తొలిజాబితా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ లో టికెట్ దక్కని, పార్టీపై అసంతృప్తిగా ఉన్న నేతలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారినికూడా టికెట్ల కేటాయింపులో పరిగణలోకి అధిష్టానం తీసుకుంటుంది. వచ్చే వారం రోజుల్లో తొలిజాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో అసంతృప్తులు పార్టీని వీడకుండా ముందస్తు చర్యలను అధిష్టానం చేపట్టింది. ఈ క్రమంలో మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది..