జనసేన నేత నాగబాబు ఆ సమయంలో టీడీపీని ట్రోల్ చేస్తూ చేసిన వీడియోని పోస్ట్ చేసి, ప్రస్తుతం వైరల్..!

టిడిపి జనసేన పొత్తు కుదిరిన,, కొంత నాయకులు మధ్య ఇటీవల కాలంలో సఖ్యత కుదరడం లేదు అనేది ఆంధ్రాలో ప్రస్తుతం నడుస్తున్న టాక్….

పోయినసారి ఎన్నికల సమయంలో జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు నా ఇష్టం పేరుతో ఉన్న యూట్యూబ్ చానెల్ లో ఓ వీడియో పెట్టాడు. ఆ వీడియోలో టీడీపీని ట్రోల్ చేస్తున్నట్లుగా ఉండటంతో, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…2019 ఎన్నికల్లో జనసేన లెఫ్ట్ పార్టీలతో పొత్తు కుదుర్చుకొని.. అప్పుడు అధికార పక్షంగా ఉన్న టీడీపీపై తెగ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకొని ఎన్నికలకు వెళ్తుండటంతో, ఇప్పుడు జనసేన నేత నాగబాబు ఆ సమయంలో టీడీపీని ట్రోల్ చేస్తూ చేసిన వీడియోని పోస్ట్ చేసి, వైరల్ చేస్తున్నారు.

ఆ వీడియోలో చిన్న పిల్లలు ఒకరు సైకిల్ నడుపుతుండగా, మరొకరు సైకిల్ కింద పడేసి తొక్కుతుంటారు. అక్కడికి వచ్చిన నాగబాబు.. ఆరోగ్యం బాగుండాలి అంటే సైకిల్ తొక్కాలి, అదే రాష్ట్రం బాగుండాలి అంటే సైకిల్ ని తొక్కాలి అని చెబుతాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అంతేగాక ఇప్పుడు ఎలా తొక్కాలి చెప్పండి సార్ అని, రోజులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఎప్పుడు అతి చేయోద్దు అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. కాగా తన ఎన్నికల్లో నాగబాబు జససేన అభ్యర్ధిగా నర్సాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి దారుణంగా ఓటమి పాలయ్యారు…