జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఏర్పాట్లు….

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలు సహా 21 షరతులతో సభకు పోలీసులు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 14న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ సమీపంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ … సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆవిర్భావ సభ సందర్భంగా యూట్యూబ్‌లో ప్రత్యేక గీతం విడుదల చేశారు. జనసైనికులను ఉత్సాహపరిచేలా ఉన్న స్పెషల్‌ సాంగ్‌ పవన్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేక గీతం పోస్టర్‌పై ‘‘ భవిష్యత్తు జెండాని మోయటంకంటే బాధ్యత ఏముంటుంది. ఒకతరం కోసం యుద్ధం చేయటంకంటే సాహసం ఏముంటుంది’’ అంటూ పార్టీ శ్రేణులకు పవన్‌ సందేశమిచ్చారు.