ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉండాలా..?. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాము..జనసేన అధినేత పవన్‌ కల్యాణ్…

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన 9వ ఆవిర్భావ సభ…

నేటితో జనసేన పార్టీ 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ ఏట అడుగుడుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని ఇప్పటం గ్రామం వద్ద జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు హాజరయ్యారు. సభకు భారీ ఎత్తున జనసైనికులు, పవన్ అభిమానులు తరలివచ్చారు. కాగా సభావేదికకు మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరిట నామకరణం చేశారు..

జై ఆంధ్రా, జైతెలంగాణ, జై భారత్ అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్…
వైసీపీలో బూతులు తిట్టే వారితో పాటు మంచి నేతలూ ఉన్నారని తెలిపారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉండాలా..? అని ప్రశ్నించారు. పార్టీ నడపడానికి కావాల్సింది సిద్ధాంతమని చెప్పారు. ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుందని పేర్కొన్నారు. నాయకత్వం అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడాలన్నారు. నాయకుడికి ఉండాల్సింది పట్టు, విడుపు అని తెలిపారు. ప్రశ్నించడమంటే మార్పునకు శ్రీకారమని వ్యాఖ్యానించారు. 2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలసీపైనే ద్వేషం.. పార్టీ, నేతలపై కాదని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు…
2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. రాజకీయాల్లో విభేదాలుండొచ్చని.. వ్యక్తిగత ద్వేషాలొద్దన్నారు. వైసీపీని కూడా గౌరవించడం జనసేన సంస్కారమని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీలో బూతులు తిట్టే వారితో పాటు మంచి నేతలూ ఉన్నారని చెప్పారు. ఒక పార్టీని నడపాలంటే వేల కోట్లు ఉండాలా అని ప్రశ్నించారు. పార్టీ నడపడానికి కావాల్సింది సిద్ధాంతమని, ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుందని పవన్ పేర్కొన్నారు…ఏపీని జగన్ నిండాముంచేశాడు. 32 మంది భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీసింది వైసీపీయే. మూడు రాజధానుల మాట ఆ రోజెందుకు చెప్పలేదు?. మద్దతిచ్చిన టీడీపీని కూడా ప్రశ్నించింది జనసేనే. ఏపీ రాజధాని ముమ్మాటికీ అమరావతే. ’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ..ప్రశ్నించడం అంటే సరికొత్త రాజ్యస్థాపన చేసి సుపరిపాలన అందించడమేనని ఆయన అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకు కార్యకర్తలను అడ్డుగా పెట్టనన్నారు. 2014లో ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నానం.. 2019 గట్టిగా నిలబడ్డాం.. 2024లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు…