అక్షయగోల్డ్ బాధితులకు జనసేన అండగా ఉంటుంది’

అక్షయగోల్డ్ బాధితులకు జనసేన అండగా ఉంటుంది’

అక్షయ గోల్డ్ బాధితులను ఆదుకుంటానని పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్‌ నెరవేర్చాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని అడిగితే బాధితులను అరెస్ట్‌ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 15 లక్షల 94 వేల మంది రూ.385 కోట్లు డిపాజిట్ చేశారని పేర్కొన్నారు. అక్షయగోల్డ్ బాధితులకు జనసేన అండగా ఉంటుందన్నారు