జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు కొత్త కాన్వ‌య్‌.. స్టేట్ ఆఫీసుకు చేరిన‌ 8 స్కార్పియోలు..

జ‌న‌సేన అధినేత కాన్వాయ్‌లో కొత్త వాహ‌నాలు చేరాయి. విజ‌య ద‌శ‌మి రోజున తిరుప‌తి నుంచి ప‌వ‌న్ పాద‌యాత్ర చేయ‌నున్నారు. దీనికి గాను ఎనిమిది కొత్త స్కార్పియోలను కొనుగోలు చేశారు. కాగా, అవి ఏపీలోని జ‌న‌సేన స్టేట్ ఆఫీస్‌కు ఇవ్వాల చేరుకున్నాయి. ఆరు నెల‌ల్లో రాష్ట్ర‌మంతా ప‌ర్య‌టించాల‌ని ప‌వ‌న్ ప్లాన్ చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి గ‌ట్టి పోటీ ఇచ్చి, త‌ప్ప‌కుండా అధికారం చేప‌ట్టాల‌నే తాప‌త్ర‌యంతో జ‌న‌సేనాని ఉన్నారు.దానికోసం ప్ర‌భుత్వ వైఫల్యాలు, అభివృద్ధి పేరుతో చేస్తున్న అరాచ‌కాలు, రైతుల ఆత్మ‌హ‌త్య‌ల వంటి అంశాల‌పై జ‌న‌సేన ఫోక‌స్ చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాన్ ప‌రామ‌ర్శించి వారి కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసి అండ‌గా నిలిచారు._