నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి….

నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి ని ఆమోదించిన కాంగ్రెస్ అధిష్టానం…

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేరు ఖరారైంది. ఈ మేరకు జానారెడ్డిని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించారు. గత అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో జానారెడ్డి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల నర్సింహయ్య మృతితో నాగార్జునసాగర్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగనుండటంతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది.