మత సామరస్యానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా…

JANPAD DARGA STORY…
మత సామరస్యానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా
మత సామరస్యానికి, మానవత్వానికి, ధైర్యానికి చిహ్నంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా విరాజిల్లుతోంది..
మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. ఆ ప్రాంతానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. అదే సూర్యాపేట జిల్లాలోని జాన్పహాడ్ దర్గా. ఈ దర్గాకు వందల ఏండ్ల చరిత్ర ఉంది. పాలకవీడు మండల కేంద్రానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఈ దర్గా ఉంది. ప్రతి శుక్రవారం భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. ప్రతి సంక్రాంతి తర్వాత జరిగే ఉర్సు ఉత్సవాలకు భక్తులు లక్షల్లో తరలివస్తారు….సుమారు 400 ఏండ్ల క్రితం మద్రాసు రాష్ట్రంలో నాగూర్ గ్రామంలో వెలసిన నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా విశిష్టతను ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రచారం చేయాలని తలచాడు. ఈ మేరకు జాన్ పహాడ్, సైదా, వాజీద్ సైదా, మోయినుద్దీన్ అనే భక్తులు బయలుదేరారనే కథ ప్రచారంలో ఉంది. అయితే తప్పుడు సమాచారంతో వీరిపై వజీరాబాద్ పాలకులు యుద్ధానికి దిగారు. అందులో వీరంతా అమరులయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి.. వజీరాబాద్ రాజకుమారుడు.. ప్రాయశ్చిత్తంగా జాన్పహడ్ దగ్గర దర్గా నిర్మించాడు..
దర్గాకు వచ్చేవారికి మొదట కనిపించేది సఫాయి బావి. భక్తులు ఇక్కడి నుంచే తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బావి నీటితో వంట వండి దేవుడికి సమర్పించడం అనవాయితీ. ఇది చాలా పవిత్రమైన బావిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ బావిలోని నీటిని పంట పొలాలపై చల్లితే మంచి దిగుబడి వస్తుందని విశ్వసిస్తారు. అలాగే పశుపక్ష్యాదులకు తాగిస్తే ఆరోగ్యంగా ఉంటాయని.. దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు ఈ నీటితో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. దర్గా ప్రాంతం అంతా అడవి కావడం వలన అక్కడికి దగ్గరకు వచ్చిన భక్తులు భయపడకుండా రక్షణ కోసం అక్కడ ఒక నాగుపామును, పెద్ద పులిని ఉంచారని పూర్వీకులు చెబుతుంటారు…

ఉత్సవాలకు రాష్ట్రంలోని జిల్లాలతోపాటు ఏపీలోని కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు…
హిందూ ముస్లిం కుల మతాలకు అతీతంగా కొలిచే భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిన జనం దేవుడు జాన్పహాడ్ సైదన్న దర్గా ఉర్సు ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఉర్సు ఉత్సవాలకు మిర్యాలగూడెం, నేరెడుచర్ల, హుజూర్నగర్, పాలకవీడు, గరిడేపల్లి, కోదాడ,సూర్యపేటలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా లక్షల సంఖ్యలో భక్తులు రానున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వక్ప్భోర్డు ఆద్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు… దర్గా వద్ద భారీ కేడ్లతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు…..వందళ ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన దర్గా అది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు దర్గాకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. మత సామరస్యానికి, మానవత్వానికి, ధైర్యానికి చిహ్నంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ దర్గా విరాజిల్లుతోంది. జాన్ పహాడ్ దర్గాకు తెలంగాణ నుంచే కాక కర్నాటక, తమిళనాడు నుంచి భక్తులు తరలివస్తారు. ముస్లింల పవిత్రస్థలమైనప్పటికీ హిందువులే అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. అందుకే మతసామరస్యానికి ప్రతీకగా ఈ దర్గాను చెప్పుకుంటారు. ….జన్ పహాడ్ దర్గా ఉర్స్ ఉత్సవాల 21.22. 23. ఉండటం తో ఏర్పాట్లు చేస్తున వక్ఫ్ బోర్డు అధికారులు…