నేటి నుంచి జాన్ పహాడ్ సైదులు దర్గా ఉర్సు…చరిత్ర ఇదే..!.

సూర్యాపేట జిల్లా..

జాన్‌పహాడ్‌ దర్గాకు 400 ఏండ్ల చరిత్ర…

హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఉత్సవాలు..

నేటి నుంచి జాన్ పహాడ్ సైదులు దర్గా ఉర్సు..

మూడు రోజుల పాటు కొనసాగనున్న ఉర్సు ఉత్సవాలు.

400 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు.

తెలుగు రాష్ట్రాల్లో హిందూ, ముస్లిం ల మత సామరష్యానికి ప్రతీక గా సైదన్న ఉత్సవాలు.

నేడు ఘనంగా చాదర్ దట్టీల సమర్పణ తో ఉత్సవాల ప్రారంభం…

ఈ నెల 26న గందోత్సవం, దీపారాధన తో ఉత్సవాలు పూర్తి.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం,వక్ప్ బోర్డు.

పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ గ్రామంలోని సైదులు బాబా దర్గా ఉర్సుకు సిద్ధమైనది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి….

400 సంవత్సరాల ఘనమైన చరిత్ర గల దర్గా భక్తుల కోరిన కోర్కెలు తీర్చేదిగా నిలిచింది. ప్రతి యేటా ఉర్సుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. దర్గాకు చేరుకోవాలంటే నేరేడుచర్ల పట్టణం నుంచి 19 కిలోమీటర్లు ప్రయాణించాలి. దామరచర్ల నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది..

మత సామరస్యానికి ప్రతీక ఆ దర్గా. ఆ ప్రాంతానికి వందల ఏండ్ల చరిత్ర ఉంది. హిందూ, ముస్లిం అన్న తేడా లేకుండా భక్తులు దర్గాకు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. అదే సూర్యాపేట జిల్లాలోని జాన్‌పహాడ్ దర్గా. ఈ దర్గాకు వందల ఏండ్ల చరిత్ర ఉంది..

ప్రతి శుక్రవారం భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటుంటారు. ప్రతి సంక్రాంతి తర్వాత జరిగే ఉర్సు ఉత్సవాలకు భక్తులు లక్షల్లో తరలివస్తారు. ..

*నాగేంద్రుడి పుట్ట, నిత్యం వెలిగే దీపం* ..

దర్గా లోపలికి వెళ్లే కుడి వైపు నాగేంద్రుని పుట్ట ఉంటుంది. పుట్టలో పాలు పోసి, పసుపు, కుంకుమ సమర్పిస్తారు. ఈ పుట్ట దగ్గర పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.తలనీలాల సమర్పణ, నామకరణాలు సైదులు బాబాపై ఈ ప్రాంతంలో భక్తులకు అపార నమ్మకం. భక్తులు దర్గా పరిసరాల్లో తలనీలాలు సమర్పిస్తారు. తమకు పుట్టే సంతానానికి సైదిరెడ్డి, సైదయ్య, సైదులు, సైదా, సైదమ్మ, సైదయ్య, సైదారెడ్డి, దర్గయ్య, దర్గారావు, దర్గారెడ్డి వంటి పేర్లు పెట్టుకుంటారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో సుమారు 40 వేల మందికి పైగా ఈ పేర్లతోనే ఉన్నారని అంచనా…

*చరిత్ర ఇదే* ..

400 సంవత్సరాల క్రితం మద్రాస్‌ రాష్ట్రంలో నాగర్‌ గ్రామంలోని నాగూర్‌షరీఫ్‌, ఖాదర్‌ దర్గా విశిష్టతను పక్క రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు జాన్‌పహాడ్‌ సైదా, మొహినుద్దీన్‌ అనే భక్తులు ఊరూరా తిరుగుతున్నారు. మత ప్రచారంలో తమ వ్యతిరేకులతో పోరాడి అమరులయ్యారని, దాంతో జాన్‌పహాడ్‌ సైదా, మొహినుద్దీన్‌ జ్ఞాపకార్థం వజీరాబాద్‌(వాడపల్లి) రాకుమారుడు దర్గాను నిర్మించారని కథనం ఉన్నది. దర్గాలో సమాధుల వద్ద నిత్యం ప్రార్థనలు చేయగా ఆ తర్వాత దర్గా విశిష్టత వాడుకలోకి వచ్చింది…

*సఫాయి బావి సర్వరోగ నివారణి..*

దర్గాకు వచ్చేవారికి మొదట కనిపించేది సఫాయి బావి. భక్తులు ఇక్కడి నుంచే తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ బావి నీటితో వంట వండి దేవుడికి సమర్పించడం అనవాయితీ. ఇది చాలా పవిత్రమైన బావిగా భక్తులు విశ్వసిస్తారు. ఈ బావిలోని నీటిని పంట పొలాలపై చల్లితే మంచి దిగుబడి వస్తుందని నమ్ముతారు. అలాగే పశుపక్ష్యాదులకు తాగిస్తే ఆరోగ్యంగా ఉంటాయని, దీర్ఘకాల రోగాలతో బాధపడేవారు ఈ నీటితో స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు…

*కందూరు* .

భక్తులు కోరిన కోర్కెలు తీరితే దర్గా వద్ద కందూరు నిర్వహిస్తారు. దీనికోసం భక్తులు బంధుమిత్రులతో కలిసి దర్గాకు వస్తారు. సఫాయి బావి నీటితో వంటకాలు చేసుకొని అక్కడే భోజనం చేస్తారు. దీనినే ఫాతేహగా పిలుస్తారు.