జపాన్ లో భూమి ఎలా కంపించిందో చూడండి!

VIDEO: జపాన్లో భూమి ఎలా కంపించిందో చూడండి!
వీడియో చూడాలంటే కింద లింక్ క్లిక్ చేయండి..
https://youtube.com/shorts/n3UVvldllgc?si=-wB2Yjtp6FzPyQqx
ఈ నూతన సంవత్సరం తొలి రోజు జపాన్ వాసులకు ఓ పీడ కలగా మిగిలిపోయింది. ఆకస్మిక భూకంపంతో ఇప్పటికే 30 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపానికి భవనాలు, రోడ్లు ధ్వంసమయ్యా యి. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు 155సార్లకుపైగా భూప్రకంపనలు నమోదయ్యాయి.

18 గంటల్లో 155 సార్లు భూమి కంపించింది. కేవలం రెండు గంటల్లోనే 40 పక్రంపనాలు వచ్చాయి. రిక్టర్ స్టేలుపై 7.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని అక్కడ వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంతాలల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. తీరప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఇప్పటి వరకు దాదాపు 13 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది..

భవనాలు కూలడం, అగ్నిప్రమాదాల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 45 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంపం వల్ల ప్రధాన రహదారులన్నీ బీటలు వారి.. వాహనాలు కదలడం అసాధ్యంగా మారింది. నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ బీటలు వారాయి. పోర్టును సునామీ అలలు తాకడంతో చాలా పడవలు బోల్తాపడ్డాయి. చాలా ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. సహాయక చర్యలు చేపట్టడానికి కూడా సమయం లేదు. వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. అసలు ఎంత ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిందో పూర్తిగా తెలియదు..