జపాన్‌ లో భారీ భూకంపం..సునామీ వచ్చే అవకాశం..!!

జపాన్‌ (Japan)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఇషికావా రాష్ట్రంలో సోమవారం ఉదయం భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4గా నమోదైనట్లు జపాన్‌ వాతావరణ కేంద్రం (Japan Meteorological Agency) వెల్లడించింది..భారీ భూప్రకంపనల ధాటికి జపాన్‌ రాధాని టోక్యో, కాంటో ప్రాంతాల్లోనూ భూమి కంపించినట్లు జపాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. అయితే, ఈ భూప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో జపాన్‌ ప్రభుత్వం సునామీ
(tsunami ) హెచ్చరికలు జారీ చేసింది. 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని.. ముందు జాగ్రత్తగా ప్రజలు వెంటనే తీర ప్రాంతాలను వదిలి వెళ్లాలని ఆదేశించింది.
https://twitter.com/ChrisKolen001/status/1741728341202440439?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1741728341202440439%7Ctwgr%5Ef6d305cff0290e7b2dc771e4d42cbb53a187e580%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

జనవరి 1న సోమవారం న్యూ ఇయర్ వేళ మధ్యాహ్నం ఉత్తర-మధ్య జపాన్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. వెంటనే, జపాన్ వాతావరణ సంస్థ ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరికను జారీ చేసింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపారు అధికారులు..

మరోవైపు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలకు బిల్డింగులు ఊగిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను జపాన్‌ వాసులు తమ ఫోన్లలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.