జపాన్ లో ఢీకొన్న రెండు విమానాలు…!

జపాన్ రాజధాని టోక్యోలో అత్యంత రద్దీగా ఉండే హనేడా ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు రన్ వేపై ఉన్న జపాన్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ప్యాసింజర్ విమానాన్ని కోస్ట్ గార్డు విమానం ఢీ కొట్టింది.

దీంతో ఒక్కసారిగా ఎయిర్ పోర్టులో మంటలు చెలరే గాయి. ఈ ఘటన తర్వాత 400 మందికి పైగా ప్రయాణి కులను, సిబ్బందిని ఎయిర్ పోర్టు నుంచి సురక్షితంగా తరలించారు.

ప్రయాణికుల విమానం అత్యంత వేగంగా రన్ వేపై వెళ్తూ మంటల్లో చిక్కుకోవ డం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జపాన్ ఎయిర్‌లైన్స్ (JAL) ఎయిర్‌ బస్ A350 విమానాన్ని కోస్ట్ గార్డ్ విమానం ఢీకొట్టింది.

మంటలు అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్ర‌మించారు..ఈ ప్ర‌మాదంలో ప్ర‌యాణీ కుల‌తో పాటు, సిబ్బంది ఎటువంటి గాయాలు కాకుండా సుర‌క్షితంగా బ‌య‌ట‌ ప‌డ్డారు..

ఈ ప్ర‌మాదంపై విచార‌ణ‌కు జ‌పాన్ ఏవియేష‌న్ శాఖ అదేశాలు జారీ చేసింది.