భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ప్యూమియో కిషిడా మధ్య న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం… భరత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనున్న జపాన్…

భారతదేశంలో భారీ స్థాయి పెట్టుబడులకు జపాన్ ముందుకు వచ్చింది. వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశంలో 42 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను లక్షంగా పెట్టుకుంటున్నట్లు జపాన్ భారత్‌కు తెలిపింది. ఇది భారతీయ కరెన్సీలో రూ భారీగా పెటుబడులు పెట్టబోతున్నట్లు తెలిపేరు….. శనివారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ప్యూమియో కిషిడా మధ్య న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జపాన్ నుంచి భారత్‌కు అత్యంత కీలకమైన స్నేహ హస్తం అందింది. భారత్‌లో వచ్చే ఐదేళ్ల కాలంలో అత్యంత ప్రతిష్టాత్మకర రీతిలో 5 ట్రిలియన్ యెన్‌లు (జపాన్ కరెన్సీ) లేదా 3.2 లక్షల కోట్లు లేదా 42 బిలియన్ డాలర్ల మేర విలువైన పెట్టుబడులకు జపాన్ ముందుకు వచ్చిందని, ఈ మేరకు ప్రధాని ఫ్యూమియోతో జరిపిన భేటీ సందర్భంగా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ప్రధాని ఆ తరువాత విలేకరులకు తెలిపారు.అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి ప్రధాని ఫ్యూమియో 14వ ఇండియా జపాన్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి మధ్యాహ్నం తరలివచ్చారు. జపాన్ ప్రధానిగా అధికార బాధ్యతల స్వీకరణ తరువాత తొలిసారిగా జపాన్ నేత భారతదేశానికి వచ్చారు. జపాన్ ప్రధానిగా మరో దేశంతో ద్వైపాక్షిక చర్చలు జరపడం కూడా ఆయనకు ఇదే ప్రధమం. గతంలో జపాన్ విదేశాంగ మంత్రిగా పలుసార్లు ప్రధాని మోదీని కలిశారు. భారత్ లో కూడా పర్యటించారు..ఉన్నత స్థాయిలో సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్త పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. భద్రతాయుత, విశ్వసనీయ, కాలాతీతమైన సుస్థిర ఇంధన సరఫరా అత్యవసరం అనే విషయాన్ని ఇరుదేశాలు గుర్తించినట్లు ప్రధాని తెలిపారు. భారతదేశపు పట్టణ మౌలిక సాధనాసంపత్తికి పూర్తి స్థాయి మద్ధతు ఇవ్వడం జపాన్ లక్షం అని ఆ దేశానికి చెందిన ప్రతినిధి బృందం తెలిపింది.తమ దేశపు ప్రతిష్టాత్మక బుల్లెటు ట్రైన్ టెక్నాలజీని సాధనంగా చేసుకుని ఏర్పాటు చేసే హై స్పీడ్ రైల్వే వ్యవస్థకు జపాన్ తోడ్పాటు ఉంటుందని జపాన్ ప్రధాని తెలిపారు. ఇప్పటి భేటీలో భాగంగా ఇరువురు నేతలు జరిపిన సమీక్ష ఫలితంగా ఆరు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పలు రంగాలలో పరస్పర సాయం, ప్రత్యేకించి స్వచ్ఛ ఇంధన భాగస్వామ్య విస్తరణపై కూడా అంగీకారం కుదిరింది.