ఓ జవాన్‌ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

సీఐఎస్ఎఫ్ జ‌వాన్ తన ప్రాణాలను అడ్డుగా పెట్టి ఎనిమిదేండ్ల బాలిక ప్రాణాల‌ను ర‌క్షించాడు. పాపకు ఏ హానీ జరగకుండా కాపాడిన ఆ జవాన్‌ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అతన్ని రియల్ హీరో అని ప్రశంసిస్తున్నారు. గ్రేట్ జాబ్, జైహింద్ జై CISF,రియల్ హీరో అంటూ ఆ జవాన్ ను ప్రశంసిస్తున్నారు… ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేష‌న్‌ లో ఆదివారం సాయంత్రం ఓ పాప ఆడుకుంటూ.. మెట్రో స్టేష‌న్‌ లో 25 ఫీట్ల ఎత్తులో ఉన్న ఫెన్సింగ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. అసలు అది ఎవరూ వెళ్లకూడని ప్రదేశం. అలాంటి చోటికి ఆ పాప వెళ్లిపోయింది. అయితే తిరిగి వ‌చ్చేందుకు ఆ బాలిక ఇబ్బంది ప‌డుతోంది. అంతేకాదు అక్క‌డి నుంచి జారిప‌డితే ప్రాణాలు గాల్లో కల‌వ‌డం ఖాయం. కాగా,ఆ పాప ప్రమాదంలో చిక్కుకుందని తెలియగానే… CISF QRT టీమ్ అక్కడికి చేరుకుంది. పాపను ఎలా కిందకు తేవాలా అని అంతా ఆలోచిస్తుండగా ఓ యవ జవాన్ రంగంలోకి దిగిపోయాడు. వేగంగా గ్రిల్ దగ్గరకు చేరిన జవాన్… పాపకు కొన్ని సూచనలు చేశాడు. తనను గట్టిగా పట్టుకోమని చెప్పాడు. అలాగే పాప జారిపోకుండా తాను కూడా జాగ్రత్తగా పట్టుకున్నాడు..