పెళ్లయిన ఐదు రోజులకే బోర్డర్‌కు పిలుపు.. ధైర్యంగా పంపిన జవాన్ భార్య .

పెళ్లయిన ఐదు రోజులకే బోర్డర్‌కు పిలుపు.. ధైర్యంగా పంపిన జవాన్ భార్య

మహారాష్ట్రకు చెందిన జవాన్‌ మనోజ్ పాటిల్‌కు ఈ నెల 5న వివాహం

వివాహ సెలవుల మీద ఉన్న జవాన్‌ మనోజ్ పాటిల్‌కు భారత్-పాక్ ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌కు తిరిగి రావాలని పిలుపు

‘నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపుతున్నా’ అంటూ కన్నీటితో పంపించిన జవాన్ మనోజ్ భార్య యామిని

పెళ్లయిన కొన్ని రోజులకే తిరిగి బోర్డర్‌కు వెళ్లడంతో కన్నీరు పెట్టిన మనోజ్ భార్య, కుటుంబ సభ్యులు..

మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా పచోరా తాలూకాలోని పుంగావ్ గ్రామానికి చెందిన మనోజ్ పాటిల్.. భారత ఆర్మీలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఆయన సెలవులపై స్వగ్రామానికి వచ్చారు. ఐదు రోజుల కిందట (మే 5) ఆయనకు యామిని అనే మహిళతో వివాహమైంది. ఇంతలోనే.. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మనోజ్ పాటిల్‌కు ఇండియన్ ఆర్మీ నుంచి పిలుపు వచ్చింది. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశం…పెళ్లి కోసం సెలవులు పెట్టి వచ్చిన జవాన్ మనోజ్ పాటిల్.. ఉన్నతాధికారుల ఆదేశంతో ఉన్నపళంగా బయల్దేరారు. పెళ్లై మూడు రోజులే.. అప్పుడే విధి నిర్వహణ కోసం బోర్డర్‌కు బయల్దేరతానంటే, పంపించేందుకు ఏ భార్య అయినా అంగీకరిస్తుందా..? కానీ, సైనికుడిని పెళ్లి చేసుకునే ముందే యామినీ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుందేమో..! మరో ఆలోచన లేకుండా దేశ సేవ కోసం తన భర్తను సాగనంపారు..