ప్రముఖ నటి బిజెపి నేత జయప్రద మిస్సింగ్..

*BIG BREAKING NEWS*

ఉత్తర ప్రదేశ్

*ప్రముఖ నటి బిజెపి నేత జయప్రద మిస్సింగ్…*

ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు..

2019 ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో విచారణకు ఆదేశిస్తూ కోర్టు సమన్లు జారీ..

పలుమార్లు కోర్టు పిలిచినా కోర్టుకు హాజరు కాని జయప్రద

జయప్రదకు నాన్ బెయిలబుల్ వారింటి ఇష్యూ చేసిన ఉత్తరప్రదేశ్ న్యాయస్థానం..

జనవరి 10న కోర్టులో హాజరు పరచాలని ఆదేశాలు..

*నాన్ బెయిల్ బుల్ వారెంట్ రావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జయప్రద..*

జయప్రద కోసం గాలిస్తున్నారు రాంపూర్ పోలీసులు..

రామ్‌పూర్‌, డిసెంబర్‌ 29: బీజేపీ నాయకురాలు, నటి జయప్రద కోసం ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తెగ వెతుకుతున్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా ఆమె హాజరు కాలేదు. దీంతో జడ్జీ ఆమెపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు.

జనవరి 10లోగా ఆమెను తన ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు. దీంతో రామ్‌పూర్‌ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోయింది. ఏప్రిల్‌ 19, 2019న జయప్రద ఎన్నికల నియమావళికి విరుద్ధంగా యూపీలోని స్వర్‌ ప్రాంతంలో ఉన్న నూర్‌పూర్‌ గ్రామంలో రోడ్డును ప్రారంభించారు. పిప్లియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.