జయశంకర్‌ సార్ విగ్రహం ధ్వంసం చేయడం హీనచర్య.. కేటీఆర్.

*జయశంకర్‌ సార్ విగ్రహం ధ్వంసం చేయడం హీనచర్య.

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా, ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు.మత్తులో తూగుతూ, పెద్ద బండరాయితో సార్ విగ్రహాన్ని పగలకొట్టాడు. శేరిలింగంపల్లి – ఆల్విన్ కాలనీ 124 డివిజన్‌లో ఈ ఘటన జరిగింది. పిచ్చి పిచ్చి గెంతులు వేస్తూ, సైకో మాదిరిగా వ్యవహరిస్తూ.. పోలీసుల ముందే రెచ్చిపోయాడు.

కేటీఆర్ ఆగ్రహం..!
ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శేర్లింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు..