భైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలి..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

*భైరి నరేష్‌ను కఠినంగా శిక్షించాలి*

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ…మతాలను, విశ్వాసాలను కించపరిస్తే కేసులు పెట్టాలన్నారు. స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని అన్నారు. నాస్తికులకు దేవుడి మీద నమ్మకం లేకపోతే ఇతరులను కించపరుస్తారా అంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు..