జేపీ నడ్డా సతీమణి కారు చోరీ.!

జేపీ నడ్డా సతీమణి కారు చోరీ!

JP nadda wife car..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి సంబంధించిన టయోటా ఫార్చూనర్ కారును ఢిల్లీ నివాసం నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు, ఈ నెల 19న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

జేపీ నడ్డా సతీమణి కారు డ్రైవర్
కేసు నమోదు చేయడంతో దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు..

మార్చి 19 న జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. జేపీనడ్డా టయాటా ఫార్చునర్ కారును ఆయన డ్రైవర్ సర్వీస్ కు ఇచ్చాడు. సర్వీసింగ్ తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు ఆకలిగా అన్పించడంతో, ఒక హోటల్ వద్ద టయాటాను పార్క్ చేసి ఫుడ్ తినడానికి వెళ్లాడు. హోటల్ లో తీరిగ్గా తిని బయటకు వచ్చి చూసేసరికి పార్చూనర్ లేదు. చుట్టుపక్కల వారిని ఆరాతీశాడు. చేసేది లేక పోలీస్‌ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు…వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. అక్కడి ఉన్న ఒకు సీసీ కెమెరాలో ముగ్గురు వ్యక్తులు ఫార్చునర్ ను చోరీ చేసి, గురుగ్రామ్ వైపుగా వెళ్తున్నట్లు రికార్డు అయ్యింది. దొంగిలించడిన కారు హిమచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉన్నట్లు తెలుస్తోంది.ఒక బీజేపీ జాతీయ అధ్యక్షుడి కారును చోరీ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై అపోసిషన్ లీటర్లు సెటైరికల్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు.

తన సొంత కారును కాపాడుకోలేని బీజీపీ నేతలు, ప్రజలకు ఏం భద్రత ఇస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోవైపు లిక్కర్ స్కామ్ ఘటన దేశంలో మరో హాట్ టాపిక్ మారింది…