కేడి డాక్టర్… వృత్తిని మరిచి.. కొత్త అడుగులు..సీన్ కట్ చేస్తే కటకటాల వెనక్కి…

*సూర్యాపేట జిల్లా* .

హుజూర్ నగర్ ..
ఓ ప్రైవేట్ హాస్పటల్ పని చేస్తున్నా ఒక డాక్టర్.. పనిచేస్తున్న హాస్పటల్ నందు సుమారు రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల నగదు మరియు 23 గ్రాముల బంగారం చోరీ చేసిన జూనియర్ డాక్టర్….
నమ్మి బాధ్యతలు అప్పజెప్పితే ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన ఘరానా కేటుగాడు….. డబ్బు మీద ఆశతో అడ్డంగా దొరికిపోయాడు… అదేంటి అలా చేసావని అడిగితే అది చేసింది నేను కాదంటూ బుకాయింపులు.. సీసీ కెమెరాలు అడ్డంగా దొరికిన డొంక తిరుగుడు మాటలు.. తమదైన శైలిలో పోలీసులు విచారించగా బయటపడిన అసలు విషయం.. సీన్ కట్ చేస్తే కటకటాలనకి జూనియర్ డాక్టర్..

పోలీస్ స్టేషన్ నందు ప్రెస్ మీట్లో లొ సిఐ రామలింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

హుజూర్ నగర్ స్థానికంగా ఉన్న అభయ హాస్పిటల్ నందు ఒక సంవత్సర కాలంగా నమ్మకంగా పనిచేస్తున్న జూనియర్ డాక్టర్ నల్గొండ జిల్లా నకిరేకల్ కు చెందిన రామకోటి (ఎంబీబీఎస్)..డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు…

అభయ హాస్పిటల్ యాజమాన్యం ఊరికి వెళ్లిన సమయం చూసి పైన ఇంట్లో దొంగ చాటుగా వెళ్లి… తన దగ్గర ఉన్న తాళంతో తీయగా యాజమాన్యానికి సంబంధించిన రూమ్ తాళం ఓపెన్ కావడంతో బీరువాలో ఉన్న నగదును సుమారుగా 2 లక్షాల 74 వేల రూపాయల నగదు, 23 గ్రాముల బంగారం చోరీ చేయడం జరిగింది..

నగదు దొంగిలిస్తుండగా సీసీ కెమెరాలు ఆధారంగా రామకోటి దొంగగా నిర్ధారించి అట్టి వ్యక్తిపై కేసు నమోదుచేసి సబ్ జైలుకు పంపించడం జరిగిందని తెలిపారు..