కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ భేటీ..

*కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ భేటీ కానున్నారు. మునుగోడు పర్యటనలో భాగంగా . ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్‌ హోటల్‌లో ఈరోజు ఆదివారం సాయంత్రం వీరిద్దరూ సమావేశం కానున్నారు. అమిత్‌షా-ఎన్టీఆర్‌ భేటీని భాజపా వర్గాలు ధ్రువీకరించాయి. ఏయే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకుంటారు? రాజకీయ పరమైన కారణాలా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమిత్‌షా-ఎన్టీఆర్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది*.