చంద్రబాబు అరెస్ట్ పై జూ ఎన్టీఆర్ స్పందించడం లేదు..అచ్చెన్నాయుడు..

రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ పిటీషన్ పైన ఈ నెల 19న విచారణ జరగనుంది. ఇదే సమయంలో లోకేశ్ ఢిల్లీ వెళ్లారు. ఇటు టీడీపీ చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే, ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్ పై జూ ఎన్టీఆర్ స్పందించలేదు. తారక్ మౌనం పైన అచ్చెన్నాయుడు స్పందించారు.చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం పైన టీడీపీ నిరసనలు కొనసాగిస్తోంది. నారా, నందమూరి కుటుంబాల నుంచి చంద్రబాబు అరెస్ట్ పైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్ పైన స్పందించలేదు. దీని పైన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదే అంశం పైన టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. జూనియర్ ఎన్ఠీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్ని అడగాలంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవరినీ స్పందించమని తాము అడగమని స్పష్టం చేసారు. సంబంధం లేని కేసులో ఇరికించారని ఆరోపించారు. హైదరాబాద్ లో విజయవాడలో స్వచ్ఛందంగా ఆందోళనలకు దిగారని చెప్పుకొచ్చారు..