జనవరి 1 నుంచి రూ.2వేల నోట్లు బ్యాన్…!!! క్లారిటీ.

రిజర్వ్ బ్యాంక్ ఇండియా కొత్త సంవత్సరం నుంచి 2 వేల రూపాయల నోట్లను బ్యాన్ చేస్తోందంటూ వస్తున్న వార్తలపై PIB ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ ఇచ్చింది. ‘జనవరి 1 నుంచి కొత్త వెయ్యి రూపాయల నోట్లు వస్తాయని, 2 వేల రూపాయల నోట్లు బ్యాంకులో ఇచ్చేయాలంటూ సోషల్ మీడియాలో వార్తలు, వీడియోలు వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు. అలాంటి వీడియోలు, వార్తలు, మెసేజ్లు వస్తే ఫార్వర్డ్ చేయకండి’ అని సూచించింది.*