జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు

స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు స్పందించారు. అలానే సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు కూడా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ అంశంమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ స్పందించకపోతే ఏమీ.. ఐ డోంట్ కేర్ అంటూ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి..

సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై విలేఖరులు బాలకృష్ణను ప్రశ్నించగా.. ఐ డోంట్ కేర్… బ్రో.. ఐ డోంట్ కేర్ అంటూ ఘాటుగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ పై బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి..

టీడీపీ(TDP)లో నందమూరి బాలకృష్ణ(Balakrishna) కీలకంగా మారుతున్నారు. ఏపీలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు…తెలంగాణ పార్టీ నేతలతో సమీక్షలతో బాలయ్య బిజీ అయ్యారు..అటు పవన్ తో పొత్తు…మద్దతు విషయంలోనూ బాలయ్య పార్టీ కేడర్ కు సూచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీని పైన భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

స్పందించని తారక్ : చంద్రబాబు అరెస్ట్ పైన ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. నందమూరి, నారా కుటుంబాలు అరెస్ట్ ను ఖండించాయి. భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రిలోనే ఉంటున్నారు. చంద్రబాబు బెయిల్ వ్యవహారం పైన ఇంకా న్యాయస్థానాల్లో విచారణ సాగుతోంది. అటు పవన్ కల్యాణ్ జైలులో చంద్రబాబును కలిసిన తరువాత పొత్తు ప్రకటించారు..

పవన్ వారాహి యాత్రలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు బాలయ్య, లోకేశ్ సూచిస్తున్నారు. పవన్ సైతం టీడీపీతో కలిసి పని చేయాలని తన కేడర్ ను కోరుతున్నారు. ఇదే సమయంలో బాలయ్య పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారారు. ఏపీ, తెలంగాణ నేతలతో పార్టీ కార్యక్రమాల పైన సమీక్షలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో పార్టీ భవిష్యత్ పైన పార్టీ నేతలతో బాలయ్య సమావేశమయ్యారు…

ఎన్టీఆర్ అదే వైఖరి : ఆ సమయంలో కొందరు టీడీపీ నేతలు తారక్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసారు. వాటికి తారక్ అభిమానులు గట్టిగా తిప్పి కొట్టారు. ఇప్పుడు లోకేశ్ పాదయాత్ర…పవన్ వారాహి యాత్రల్లోనూ జూ ఎన్టీఆర్ ఫొటోలతో అభిమానులు కనిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత జూ ఎన్టీఆర్ స్పందించకపోవటం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నా..ఆ విమర్శలను జూ ఎన్టీఆర్ డోన్ట్ కేర్ అన్నట్లుగా ఉన్నారు.

కొద్ది రోజుల క్రితం అచ్చెన్నాయుడు సైతం తారక్ స్పందించకపోవటంపైన ఆయన్నే అడగాలంటూ అసహనం వ్యక్తం చేసారు. దీంతో, అసలు జూ ఎన్టీఆర్ ఈ పరిణామాలు,,విమర్శల వేళ డోన్ట్ కేర్ అంటూ తన సినిమాల్లో నిమగ్నమైతే..ఇప్పుడు బాలయ్య తాజాగా డోన్ట్ కేర్ అనటం ఏంటంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.