కార్యకర్తలను ఎవరు ఇబ్బందులకు గురిచేసిన సహించే ప్రసక్తేలేదు, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెపుతాం…మాజీ మంత్రి జూపల్లి..

కార్యకర్తలను ఎవరు ఇబ్బందులకు గురిచేసిన సహించే ప్రసక్తేలేదు సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెపుతాం అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల జూపల్లి ప్రధాన అనుచరులు, కార్యకర్తలు జూపల్లి యువసేన నాయకులతో ఈదమ్మ దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించి పలు అంశాలను చర్చించారు..ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో కార్యకర్తలను ప్రజా ప్రతినిధులను అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తప్పుడు కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తమ నాయకత్వంలో నియోజకవర్గంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించాలని కానీ నేడు ఉద్యమాలకు ఎలాంటి సంబంధం లేని వారు నేడు నియోజకవర్గంలో అధికారాన్ని అనుభవిస్తూ వివిధ శాఖల అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని మాపై ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని కార్యకర్తలు జూపల్లికి విన్నవించారు.నిన్నటి నుండి తాను ఏదో పార్టీలో చేరబోతున్నానని తన ప్రమేయం లేకుండా తప్పుడు వార్తలు రాస్తున్నారని అలాంటి వార్తలకు కార్యకర్తలు ఎవరు కూడా గందరగోళ పడొద్దని తాను ఏ నిర్ణయం తీసుకున్నా అది నమ్మిన కార్యకర్తల శ్రేయస్సు కోరి ప్రజల ఆకాంక్షల మేరకే తీసుకుంటానని ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని పునరుద్గటించారు…