సరదాగా నవ్వుకోండి…

*సరదాగా నవ్వుకోండి.*

😂 *జైలర్: ఈరోజు నిన్ను ఉరి తీస్తారు. నీ చివరి కోరిక ఏంటో చెప్పు..?*
*ఖైది: నా బదులు మీరేస్కోండి… సార్…!*

😂 *”ఏమండీ మన బాబు నిద్రలో జడుసుకుంటున్నాడు….”*
*”వాడి పెళ్ళాం ఎక్కడో పుట్టినట్టుందిలే..నువ్వు పడుకో..”*

😂 *బస్సులల్లో ఆడవారు కూరుచ్చునే వైపు “ఆడవాళ్ళని గౌరవించండి”.. అని వ్రాశారు సరే…*
*అలాగే మగ వాళ్లు వైపు “మగ వాళ్ళను గౌరవించండి”… అని రాయాలి కాదా..*
*కానీ మావైపెమో…. “దొంగలున్నారు జాగ్రత్తా”.. “టికెట్ లేని ప్రయాణం నేరం” అని రాస్తారా ఇది అన్యాయం కాదా.!!*

😂 *”టీచరుకిచ్చి పెళ్ళి చేసి నా గొంతు కోశారు” భోరుమంది సుశీల.*
*”ఏవైందమ్మా… నిన్నేమన్నా అన్నాడా..?” అడిగింది తల్లి. “నిన్న వడ్డించిన కూరలో కాస్త ఉప్పు తక్కువైందని ఆ కూరను పదిసార్లు వండమన్నాడు” చెప్పింది సుశీల.*

😂 *భార్య : గత 4 సంవత్సరాలుగా నేను వ్రతాలు ఏవీ చేయడం లేదు…*

*భర్త : ఇప్పుడేమైంది..*

*భార్య : అయినా మీరు ఆరోగ్యంగా ఉన్నారు..!!*

*భర్త : అవును..నేను ఆరోగ్యం పై చాలా శ్రద్ధ తీసుకుంటుంటాను.*

*భార్య : నేనేం వెర్రి దానిలా కనిపిస్తున్నానా.. తిన్నగా నిజం చెప్పు..ఎవర్తది..నీ ఆరోగ్యం కోసం పూజలు, వ్రతాలూ చేస్తున్నది. ?*

*వామ్మో…భర్త వెర్రి చూపులు చూస్తున్నాడు..*

😂 *భార్యాభర్తలైన సుబ్బారావు, సుందరి ఏడు గంటలు ఏకధాటిగా దెబ్బలాడి అలసిపోయారు. చివరికి..*
*సుబ్బారావు- “.. సరే, పైన దేవుడున్నాడు… నాది తప్పయితే నేనే పోతాను..” అన్నాడు రొప్పుతూ. “గుళ్లో అమ్మోరుంది.. నాది తప్పయితే నా పసుపు కుంకాలే పోతాయిలే…” ముక్కు చీదుతూ అంది సుందరి.*

😂 *ఇదిగో అక్కా ! పక్కింటాయన కోమా లోకి వెళ్ళాట్ట తెలుసా!*

*అవునా ! ఈ డబ్బున్నోళ్లు ఎక్కడికైనా వెళతారమ్మా!*

😂 *కట్నం ఎందుకు తీసుకుంటారో ఇప్పుడు నాకు అర్ధం అయ్యింది. పెళ్లి జరిగిన తర్వాత భార్య పెట్టే మానసిక సమస్యలకు “నష్ట పరిహారంగా” భర్త కట్నం తీసుకుంటాడు.*

😂 *భార్య : ఏవండీ..కొన్నేళ్ల కిందట నేను పెప్సీ బాటిల్ లా సన్నగా.. నాజుగ్గా ఉండేదాన్ని కదా…*
*భర్త : ఇప్పుడు కూడా నువ్వలానే ఉన్నావ్ డియర్..*
*భార్య (ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ) నిజమా!!..*
*భర్త : అవును..కాపోతే అప్పుడు 200ml బాటిల్..ఇప్పుడు 2.5ltr బాటిల్.. అంతే.*
*భార్య : సచ్చినోడా..*

😂 *మొగుడు: పండగకి చీర కావాలా? చుడీదార్ కావాలా?*
*పెళ్లాం: నాదేం ఉంది మీకు ఏది ఉతకడానికి సులువుగా ఉంటుందో అదే కొనివ్వండి.*

😂 *ఏవోయ్ రామారావు ఎనిమిదైంది, అసలేకొత్తగా పెళ్ళయింది, ఇంకా ఆఫీసులోనే పనిచేస్తూ ఉన్నావు ఇంటికి వెళ్ళాలనిపించడం లేదా? అని అడిగాడు ఆఫీసర్. ఏం లేదు సార్, మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. “ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి” రహస్యం చెప్పాడు రామారావు.*

*భర్త : నీ చీర పని మనిషికి ఇచ్చావా?*
*భార్య : అవును.. ఏమైంది?*
*భర్త : వంటింట్లో ఉంటే నువ్వే అనుకుని వెళ్ళి..*
*భార్య : ఆ.. అనుకుని.. వెళ్ళి.. ఏమైంది.. త్వరగా చెప్పండి.. ఏంచేశారు?*
*భర్త : నీకెందుకు శ్రమ తప్పుకో అని అంట్లన్నీ నేనే కడిగేశా!!*