నా గెలుపు ఖాయమైంది.. కేఏ పాల్‌..

ఓ భోజనశాలలో బెంచీపై పడుకున్న కేఏ పాల్‌

మునుగోడులో 30 నుంచి 50 వేల ఓట్ల ఆధిక్యంతో తాను గెలుస్తున్నానని, మీ గుండెల్లో నేనున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్‌ తెలిపారు. చౌటుప్పల్‌ పురపాలిక లింగోజీగూడెంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు 27 మంది స్వతంత్ర అభ్యర్థులు మద్దతునిస్తున్నారని చెప్పారు. భాజపా వాళ్లు ఓడిపోతున్నారని తెలిసి నా ప్రియ శిష్యుడు జేపీ నడ్డా మునుగోడు సభకు రాకుండా రద్దు చేశారని తెలిపారు. తన గెలుపే వారి గెలుపుగా ప్రకటించాలని కోరుతున్నానని తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి స్రవంతిరెడ్డి కూడా తనకు మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెరాస మూడు నెలల్లో రూ.11,200 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు చేసినట్లు సమాచారముందన్నారు. ఇందులో రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ఈ నియోజకవర్గం బాగయ్యేది కదా కేసీఆర్‌ అని ప్రశ్నించారు. తెరాస వాళ్లు తాను అద్దెకు తీసుకున్న గది కూడా దక్కకుండా చేస్తున్నారని, నిన్న దాడి చేయడానికి ప్రయత్నించారని, అయినా…తగ్గేదేలే! అని తెలిపారు.

కొసమెరుపు: లింగోజీగూడెంలోని హైవే-9లో మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం ఉందని కేఏ ప