కాలిఫోర్నియాలో ఢీకొన్న రెండు విమానాలు.. పలువురు మృతి..

అమెరికాలోని కాలిఫోర్నియాలో రెండు విమానాలు ఢీకొని కుప్పకూలిపోయాయి. ఈ దుర్ఘటనలో పలువురు మరణించారు. (అమెరికా కాలమానం ప్రకారం) కాలిఫోర్నియాలోని వాట్సన్‌విల్లేలోని మున్సిపల్‌ విమానాశ్రయంలో రెండు చిన్నపాటి విమానాలు దిగేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలి పోయాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఎంతమంది మరణించారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై విమానయాన అధికారులు దర్యాప్తు చేస్తున్నామన్నారు..