కన్నడ హీరో పునీత్ రాజుకుమార్…నిజ జీవితంలో సేవా గుణంలో కూడా హీరోనే..!

కన్నడ హీరో పునీత్ రాజుకుమార్ హార్ట్ ఎటాక్ రావడం తో ఐసీయూ లో చికిత్స పొందుతు కన్నుమూశారు.

పునీత్ రాజుకుమార్ నిజ జీవితంలో కూడా హీరోనే….. ఆయన సేవా కార్యక్రమాలు..
45 ఉచిత విద్య సంస్థలు
26 వికలాంగుల విద్య సంస్థలు
16 ఆశ్రమాలు
19 గోషలలు
1800 పిల్లలను చదివించడం
2 కండ్లు దానం
దాన ధర్మాలకు మరో రూపం
( పునీత్ రాజ్ కుమార్).. అంటూ కన్నడ అభిమానులు పిలుస్తుంటారు..పునీత్ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచనున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కంఠీరవ స్టేడియానికి భారీగా చేరుకుంటున్నారు. కాగా పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. ఆయన తండ్రి రాజ్‌కుమార్ సమాధి వద్దే పునీత్ అంత్యక్రియలు కూడా జరపాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ లాంఛనాలను ప్రభుత్వం తరఫున నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది..

#PuneethRajkumar
అలాంటి పునీత్ రాజ్ కుమార్ జి ఇక లేరు..