కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు…


కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దేశానికి 2014లోనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష అని అన్నారు. దీంతో దేశానికి స్వాతంత్ర్యం తీసు కొచ్చిన ఎందరినో అవమానించిందంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. హేట్‌ స్పీచ్‌లకు ఆమె ప్రతినిధిలా తయా రైం దంటూ కంగనారనౌత్‌ పై ఎన్సీపీ నేతలు ఫైర్‌ అయ్యారు. కంగనా పై దేశద్రోహం కేసు పెట్టాలని ఆప్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై మోడీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని మౌనంగా ఉండటం ఏం టని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ సైతం కంగనా తీరు పై మండిపడ్డాడు. ఆమెకు ఇచ్చిన పద్మశ్రీని కూడా వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ పెరుగుతుంది…అయితే ఇప్పుడు తాజాగా మహాత్మాగాంధీ మునిమనువడు తుషార్ గాంధీ ట్విట్టర్‌ వేదికగా ఆమెపై విరుచుకుపడ్డారు. కంగనాను “ద్వేష పూరిత ఏజెంట్” గా అభివర్ణించారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాల యం సమాధానం చెప్పాలన్నారు. పద్మశ్రీ కంగనా రనౌత్ ద్వేషం, అసహనం, క్రూరత్వానికి ఏజెంట్ అన్నారు. 2014లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని ఆమె భావించడంలో ఆశ్చర్యం లేదు. ద్వేషం, అసహనం, బూటకపు దేశభక్తి, అణచివేతలకు 2014లో విముక్తి లభించిందని తుషార్‌ గాంధీ ట్వీట్‌ చేశారు…

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతదేశానికి అసలైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చింది. అంతకుముందు 1947లో మనకు లభించింది భిక్షం. ఆ విధంగా దొరికినదాన్ని స్వాతంత్ర్యంంగా పరిగణిస్తామా? అని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి…

సీపీఐ సీనియర్ నేత నారాయణ ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విలాసవంతమైన బిక్షగత్తే ఎవరైనా ఉన్నారంటే అది ఈ మధ్య పద్మశ్రీ అవార్డు తీసుకున్న నటి కంగనా రనౌత్‌ అంటూ ఘాటుగా విమర్శించారు. ఆమెకు స్వాతంత్య్ర పోరాటం గురించి పెద్దగా తెలియదు. ఆ బిరుదు ఇచ్చిన బీజేపీకి అస్సలు తెలియదంటూ నారాయణ మండిపడ్డారు..