తెలుగుతెరపై నందమూరి తారక రామారావుకి పోటీగా పౌరాణికి పాత్రలు పోషిస్తూ సినీ పరిశ్రమలో ఎంతో పేరుని సంపాదించుకున్న నటుడు ‘కైకాల సత్యనారాయణ’. అయితే గత కొంతకాలంగా కైకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. కాగా ఈ ఉదయం అయన ఆరోగ్య పరిస్థితి విషమం కావడంతో..గత కొంతకాలంగా కైకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. పూర్తిగా ట్రీట్మెంట్ బెడ్‌కే పరిమితం కావడంతో, అయన ఇంటి వద్దే చికిత్స అందిస్తూ వస్తున్నారు వైద్యులు. ఇటీవల కైకాల బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, కైకాల ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా కేక్ ని కూడా కట్ చేయించాడు.
కాగా ఈ ఉదయం అయన ఆరోగ్య పరిస్థితి విషమం కావడంతో, 87 ఏళ్ళ కైకాల సత్యనారాయణ తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన హెల్త్ బులిటెన్ విడుదల కావాల్సి ఉంది. కైకాల మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి..
నాటక రంగ కళాకారుడిగా జన్మనిచ్చిన గుడివాడన్నా కైకాల సత్యనారాయణకు ఎంతో అభిమానం. కళాకారుడిగా తీరక లేని రోజుల్లో కూడా తరచూ కౌతవరం వచ్చి.. తన మిత్రులను కలుసుకునేవారని గ్రామస్థులు చెపుతున్నారు. కైకాల బాల్యం ఎక్కువగా ఊరి చెరువు చుట్టూనే పెనవేసుకొని ఉండడంతో.. ఆ చెరువంటే ఆయనకు ఎనలేని ప్రేమ ఉండదని.. కౌతవరం నుంచి ఎవరు వచ్చినా సరే చెరువు బాగోగులు అడిగి తెలుసుకునేవారని గ్రామస్థులు తెలిపారు. గ్రామ చెరువులో పెరిగిన చాపలను కైకాల అమిత ఇష్టంగా తినేవారని స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. గ్రామంలో ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరోవైపు కైకాల మృతిపై సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కైకాలతో తమకున్న అనుబంధం గుర్తు చేసుకుంటున్నారు.