కాలేశ్వరం ప్రాజెక్టు పెద్ద కుంభకోణం…వైఎస్ షర్మిల..

ఇండియాలో జరిగిన పెద్ద పెద్ద కుంభకోణాల కంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది పెద్ద కుంభకోణమని వైఎస్ షర్మిల
అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేసి కేసీఆర్ అవినీతి బయటపెడతానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది రాష్ట్రానికి అసలు ఏమాత్రం అవసరం లేని ప్రాజెక్ట్ అని, కమీషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు..18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి కేవలం లక్షన్నర ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో పాటు మరెన్నో ప్రాజెక్టులు కట్టారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగిందన్నారు. సుమారు రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై వెంటనే విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.