కల్కి కోసం మరో హీరో.. గెస్ట్ రోల్.?

ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతి మూవీ బ్యానర్ పై దాదాపు 500 కోట్లతో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కి. ఇటీవలే ఈ సినిమాకు ‘కల్కి 2898 AD’ అనే టైటిల్ ని హాలీవుడ్(Hollywood) లోని కామిక్ కాన్(Comic Con)ఈవెంట్లో గ్లింప్స్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు. ఇక గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్ ని మించి ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898’ ఫస్ట్ గ్లిమ్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్ తోనే కన్ఫామ్ చేసేసారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా, లెజెండర్ యాక్టర్ అమితాబచ్చన్, కమలహాసన్, దిశాపటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితోపాటు ఈ సినిమాలో మరో యంగ్ స్టార్ హీరో కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.