కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర…..మహావీర చక్ర పురస్కారంతో తాను 100 శాతం సంతృప్తి చెందడం లేదని ఆయన తండ్రి బీ ఉపేంద్ర..!
కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర ప్రకటించింది. తెలంగాణ సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు బీహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారిగా ఉన్నారు. గత ఏడాది జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు. నాటి ఘటనలో కల్నల్ సంతోష్‌బాబుతో పాటు మొత్తం 20 మంది సైనికులు అమరులయ్యారు. మహావీర చక్ర పురస్కారంతో తాను 100 శాతం సంతృప్తి చెందడం లేదని ఆయన తండ్రి బీ ఉపేంద్ర పేర్కొన్నారు. తన తనయుడిని పరమవీర చక్రతో గౌరవించాలని అభిప్రాయ పడ్డారు. ‘నాకు అసంతృప్తి లేదు. కానీ నేను (మహావీరచక్ర అవార్డుతో) వందశాతం సంతృప్తి చెందడం లేదు. మరింత మెరుగ్గా నా కొడుకునే గౌరవించడానికి అవకాశం ఉంది. కానీ ఆయన విధులకు గుర్తింపుగా సంతోష్‌బాబును అత్యున్నత మిలిటరీ అవార్డు పరమ వీరచక్రతో గౌరవించాలని నా అభిప్రాయం’ అని ఉపేంద్ర పీటీఐకి చెప్పారు…‘నా కొడుకు చూపిన శౌర్య పరాక్రమాలు సైనిక బలగాల్లో పని చేస్తున్న వారితోపాటు పలువురికి స్ఫూర్తినిచ్చాయి’ అని ఉపేంద్ర వ్యాఖ్యానించారు. గతేడాది జూన్ 15వ తేదీన గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 16వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్‌బాబుతో సహా 20 మంది సైనికులు ముఖాముఖీ పోరాడి అశువులు బాసి అమరులు అయ్యారు. పలు దశాబ్దాలుగా చైనా, భారత్ మధ్య తీవ్రంగా జరిగిన సైనిక ఘర్షణల్లో ఇదొకటిగా నిలిచింది.గల్వాన్లోయలోని వాతావరణ పరిస్థితులతో తలెత్తిన సవాళ్లను అధిగమించి చైనా బలగాలతో తన కొడుకు పోరు సల్పాడని ఉపేంద్ర అభిప్రాయ పడ్డారు.