కల్తీ పాలను తయారు చేసి హైద్రాబాద్ కు తరలిపు… !..పాలను నిలువ ఉంచడానికి హాని కర రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించిన అధికారులు..!

యాదాద్రి భువనగిరి జిల్లా.

అడుగడుగునా కల్తీ లతో జనం ప్రాణాలతో ఆటలాడుకుంటున్న అక్రమార్కులు.. నిత్యావసరాల ఎక్కువగా వాడేది పాలు అటువంటి పాలన కూడా కలుషితం చేసి హైదరాబాదు లాంటి మహానగరాల్లో కనిపిస్తున్నారు…

చౌటుప్పల్ డివిజన్ పరిధిలో జోన్ 5 ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కల్తీ పాల ఉత్పత్తి తనికీలు.

అనుమానిత పాల ఉత్పత్తిదారుల నుండి 10 శాంపిల్ లను సేకరించిన అధికారులు

హైద్రాబాద్ ల్యాబ్ కు తరలించి వచ్చిన ఫలితం ఆధారంగా తయారుదారులపై క్రిమినల్, ఫుడ్ సేఫ్టీ సెక్షన్ ల కింద కేసు నమోదు చేస్తామన్న అధికారులు.

పౌష్ఠిక ఆహారమైన పాలను లైసెన్స్ లేకుండా విక్రహించడం కూడా నేరమే.

చౌటుప్పల్ డివిజన్ పరిధిలో చాల మంది కల్తీ పాలను తయారు చేసి హైద్రాబాద్ కు తెల్లవారుజామునే తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు నిత్యం ఈ తనిఖీలు నిర్వహిస్తమన్నారు

పాలను నిలువ ఉంచడానికి హాని కర రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించిన అధికారులు…