మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో స్థానికంగా ఆందోళన చెలరేగింది.

లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లులోన 15వ పిల్లర్ నుంచి 20వ పిల్లర్ వరకు బ్రిడ్జి వంగి కనిపిస్తోంది..మూడు గంటలుగా బ్రిడ్జిపైకి ప్రయాణికులను పోలీసులు అనుమతివ్వడం లేదు. అందరిని ఒకేసారి కాకుండా ఒక్కొక్కర్ని బ్రిడ్జిపైకి అనుమతిస్తున్నారు.

చీకటి, నీళ్లు ఉండటంతో నదిలో పిల్లర్ పరిస్థితి తెలియడం లేదని ఇంజినీరింగ్ అధికారులు వివరిస్తున్నారు. ఎన్ని పిల్లర్లు కుంగిపోయాయని క్లారిటీ లేదు. పరిస్థితి ఏమిటనేది ఇంకా తెలియడం లేదంటున్నారు. ఇంజినీరింగ్ అధికారులు తెల్లారితే కానీ బ్రిడ్జి పరిస్థితిని అంచనావేయలేమంటున్నారు. ప్రస్తుతం లక్ష్మీబ్యారేజ్ మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు కొనసాగుతున్నాయి.

కాగా, ప్రాజెక్టు పిల్లర్లు కుంగింది వాస్తవమేనని ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు చెప్పారు. గేట్ల నుంచి సౌండ్స్ వస్తున్నాయని.. తెల్లవారితే గానీ ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. ప్రస్తుతం 40 గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తిరుపతి రావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం బ్యారేజ్ ను అధికారులు పరిశీలించారు.