కల్యాణ లక్ష్మి పథకానికి రూ.337 కోట్లు విడుదల

*కల్యాణలక్ష్మికి రూ.337.50 కోట్లు*

హైదరాబాద్‌: కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ సంక్షేమశాఖ మరో రూ.337.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ సంక్షేమశాఖ పరిధిలో కల్యాణలక్ష్మి పథకానికి రూ.1350 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఇప్పటికే రూ.1012.5 కోట్లు విడుదల చేసింది. తాజాగా మిగతా రూ.337.50 కోట్లు విడుదల చేసింది.