జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదుల హతం..

*నగర్‌ జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి..

ఈ ఘటనలో అయిదుగురు విదేశీఉగ్రవాదులను జవాన్లు హతమార్చారు.
ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న సైన్యం, పోలీసులు గురువారం రాత్రి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఈక్రమంలోనే పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని కాశ్మీర్‌ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు మరణించారని.. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు..