కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు…

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తాన్నారు. అయితే తాను బీజేపీలో మాత్రం చేరడం లేదన్నారు. ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. బెంగళూరులో సీఎం బొమ్మైతో కలిసి మీడియా ముందుకు వచ్చిన కిచ్చా సుదీప్‌… కర్ణాటకలో బీజేపీ విజయం కోసం కృషి చేస్తానన్నారు. కష్టకాలంలో బీజేపీ తనకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. కష్టకాలంలో అందుకే ఇప్పుడు వారికి సపోర్టు చేస్తాన్నట్లు వెల్లడించారు. ఇక కిచ్చా సుదీప్ నిర్ణయంపై సీఎం బొమ్మై సంతోషం వ్యక్తం చేశారు.